డెంగ్యూ అనేది వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. ఇది ఇన్‌ఫెక్షన్ ఉన్న ఏడిస్ (Aedes) దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది; ఈ దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఇది ఒక మనిషి నుంచి మరో మనిషికి నేరుగా అంటదు.
ఉష్ణమండల, ఉపఉష్ణమండల దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది: ఇప్పుడు ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది దీని ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఏటా సుమారు 100 నుంచి 400 మిలియన్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయని అంచనా.
చాలా ఇన్‌ఫెక్షన్లు తేలికగా ఉంటాయి, లేదా అసలు లక్షణాలే ఉండవు. ఇన్‌ఫెక్షన్ వచ్చినవారిలో దాదాపు ప్రతి 4 మందిలో 1 వ్యక్తికి జబ్బు చేస్తుంది, జబ్బు చేసినవారిలో దాదాపు ప్రతి 20 మందిలో 1 వ్యక్తికి తీవ్రమైన డెంగ్యూ (severe dengue) వస్తుంది; ఇది షాక్, శరీరం లోపల రక్తస్రావం, మరణానికి కూడా దారితీయవచ్చు.
డెంగ్యూ వైరస్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. ఒక రకం వచ్చినంత మాత్రాన మిగతా రకాల నుంచి రక్షణ ఉండదు, రెండోసారి ఇన్‌ఫెక్షన్ వస్తే తీవ్రమైన డెంగ్యూ ప్రమాదం ఎక్కువ.

